సాఫ్ట్‌బాల్‌ టోర్నీకి జిల్లా క్రీడాకారులు | softball tournament in district sportsmens | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌బాల్‌ టోర్నీకి జిల్లా క్రీడాకారులు

Jul 26 2016 12:08 AM | Updated on Oct 8 2018 5:07 PM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: పంజాబ్‌ రాష్ట్రం జలందర్‌లో వచ్చేనెల 6 నుంచి 10 వరకు జరిగే జాతీయస్థాయి జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ టోర్నీకి జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు.

మహబూబ్‌నగర్‌ క్రీడలు: పంజాబ్‌ రాష్ట్రం జలందర్‌లో వచ్చేనెల 6 నుంచి 10 వరకు జరిగే జాతీయస్థాయి జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ టోర్నీకి జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. బాలకృçష్ణ (రాచాల), విజయ్‌ (కొత్లాబాద్‌), హకీం (మహబూబ్‌నగర్‌), అబూబకర్‌ (జానంపేట)లు ఇటీవలే నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన అంతర్‌జిల్లా సాఫ్ట్‌బాల్‌ టోర్నీలో మెరుగైన ప్రతిభ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నేటి నుంచి వచ్చేనెల 4 వరకు జరిగే కోచింగ్‌ క్యాంప్‌లో పాల్గొననున్నారు. వీరిని సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా సాఫ్ట్‌బాల్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ అభినందించారు. జాతీయస్థాయి టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భవిత కళాశాల డైరెక్టర్‌ విద్యాసాగర్, కోచ్‌ సాధిక్‌ అలీ, పీఈటీ నాగరాజు, సీనియర్‌ క్రీడాకారుడు సర్దార్‌ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement