వరదాయిని..రాజరాజేశ్వరీ | rajarajeswary as varadayeni | Sakshi
Sakshi News home page

వరదాయిని..రాజరాజేశ్వరీ

Oct 10 2016 10:12 PM | Updated on Sep 27 2018 5:46 PM

వరదాయిని..రాజరాజేశ్వరీ - Sakshi

వరదాయిని..రాజరాజేశ్వరీ

పాశ, అంకుశంలను ధరించి చెరకుగడను చేతబూని మందస్మితంతో ఆశీనురాలై సకల లోకాలకు అధిదేవత శ్రీచక్ర నగర నాయకి అయిన రాజరాజేశ్వరిదేవిగా శ్రీశైల భ్రమరాంబాదేవి భక్తులకు సోమవారం దర్శనమిచ్చారు.

పాశ, అంకుశంలను ధరించి చెరకుగడను చేతబూని మందస్మితంతో ఆశీనురాలై సకల లోకాలకు అధిదేవత శ్రీచక్ర నగర నాయకి అయిన రాజరాజేశ్వరిదేవిగా శ్రీశైల భ్రమరాంబాదేవి భక్తులకు సోమవారం దర్శనమిచ్చారు.  శ్రీచక్రరూపంలో భక్తులందరూ కుంకుమార్చన చేసి తరించేది ఈ అమ్మవారిపూజతోనే. ఆమె చేతిలోని పాశం, అంకుశం భక్తుల కష్టాలను దూరం చేసే ఆయుధాలు.  అభయముద్ర, చెరకు..భక్తులకు రమావాణిసేవిత రాజరాజేశ్వరీదేవి ఇచ్చే వరాలు. ఈ దేవిని సేవిస్తే ఉన్నత పదవులు లభిస్తాయని, ఇష్టకార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
- శ్రీశైలం 
 

Advertisement
 
Advertisement
Advertisement