విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉంది.
విశాఖపట్నం : విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా... దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే రాయలసీమలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.