కోస్తాంధ్రలో వర్షాలు ! | rains in coastal andhra, says visakhapatnam meteorological department | Sakshi
Sakshi News home page

కోస్తాంధ్రలో వర్షాలు !

Jun 25 2016 11:48 AM | Updated on Sep 4 2017 3:23 AM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది నేడో రేపో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు... ఉత్తర కోస్తాలోనూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

దక్షిణ కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు విస్తాయని చెప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Advertisement
 
Advertisement
Advertisement