కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు | Rains in coastal andhra pradesh | Sakshi
Sakshi News home page

కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు

Sep 13 2015 9:52 AM | Updated on Sep 3 2017 9:20 AM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది.

విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. అయితే అల్పపీడన ప్రాంతంలోనే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. అలాగే ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement