46 మండలాల్లో తుంపర్లు | Sakshi
Sakshi News home page

46 మండలాల్లో తుంపర్లు

Published Wed, Aug 31 2016 11:53 PM

rain in 46 mandals

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లా వ్యాప్తంగా బుధవారం 46 మండలాల్లో తుంపర వర్షం పడింది. గుత్తి మండలంలో 26 మి.మీ వర్షం పడగా రొద్దం, పెనుకొండ, గోరంట్ల, ముదిగుబ్బ, ధర్మవరం, రామగిరి, బత్తలపల్లి, నార్పల, గార్లదిన్నె, పామిడి, శింగనమల, పెద్దపప్పూరు, తాడిపత్రి, యాడికి, పెద్దవడుగూరు తదితర ప్రాంతాల్లో తుంపర వర్షం కురిసింది. జిల్లా అంతటా 1.4 సగటు వర్షపాతం నమోదైంది. మొత్తమ్మీద ఆగస్టు నెలలో 88.7 మి.మీ గానూ 80 శాతం తక్కువగా 18.1 మి.మీ నమోదైంది. 

Advertisement
Advertisement