రిక్తహస్తాలతో వచ్చిన పోలీసు బందం | Sakshi
Sakshi News home page

రిక్తహస్తాలతో వచ్చిన పోలీసు బందం

Published Wed, Jul 27 2016 12:30 AM

police emptyhands

రిక్తహస్తాలతో వచ్చిన
పోలీసు బందం
చోరీకేసు,అనంతపురం,విశాఖపట్నం జిల్లా, theftcase,emptyhands,police
 
కశింకోట: 
కశింకోటలోని నూకాంబిక అమ్మవారి ఆలయంలో జరిగిన దొంగతనం కేసులో  దొంగల్ని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల బందానికి ప్రయాసే మిగిలింది.  రెండోసారి అనంతపురానికి వెళ్లిన బందం రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. ఇక్కడి నూకాంబిక  ఆలయంలో సుమారు రెండు తులాల బంగారు గొలుసు, మూడు కిలోల 20 గ్రాముల వెండి ఆభరణాలు, హుండీల్లో నగదు చోరీకి గురికి గురైన విషయం తెలిసిందే.  అదే రోజు స్థానిక హౌసింగ్‌ కాలనీ వాసులు ఓ అనుమానితుడిని పట్టుకుని  పోలీసులకు అప్పగించగా, అతని సహాయంతో పట్టుకున్న అనంతపురానికి చెందిన మరో అనుమానితుడిని  పోలీసు స్టేషన్‌లో విచారణ కోసం ఉంచారు.  వారిద్దరూ పోలీసుల కళ్లు గప్పి పరారవడంతో,  నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను  ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. 
ఈ నేపథ్యంలో ఎలాగైనా దొంగలను పట్టుకొని తీరాలనే పట్టుదలతో  ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావుతో పాటు ఐదుగురు పోలీసులతో కూడిన బందం రెండో సారి అనంతపురానికి వెళ్లింది.  దొంగలు  ఇళ్లకు చేరకుండా తప్పించుకొని తిరుగుతుండటంతో చేసేది లేక   తిరిగి ఇక్కడకు వచ్చి వేసింది.   దొంగలు ఇళ్లకు చేరకుండా  మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు  ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.  
 
 

Advertisement
Advertisement