బైక్‌ కాదు సైకిలే | no bike only cycle | Sakshi
Sakshi News home page

బైక్‌ కాదు సైకిలే

Jul 24 2016 9:20 AM | Updated on Sep 4 2017 5:54 AM

బైక్‌ కాదు సైకిలే

బైక్‌ కాదు సైకిలే

చక్రాలు చూస్తే బైక్‌ ... ఆకారం పరిశీలిస్తే సైకిల్‌...ఇది చైనా తయారీ.

చక్రాలు చూస్తే బైక్‌ ... ఆకారం పరిశీలిస్తే సైకిల్‌...ఇది చైనా తయారీ.  చైనా దేశానికి చెందిన షినానో కంపెనీ తయారు చేసిన ఈ బైక్‌ లాంటి సైకిల్‌ పలువుర్ని ఆకట్టుకుంటోంది. యానాంలోని మావుళ్లమ్మ గిఫ్ట్స్‌ షాప్‌ అధినేత మహేష్‌ ఈ సైకిల్‌ను సుంకరపాలెం వేసుకురాగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది.

సుమారు రూ.20 వేలు ఖరీదు చేసే ఈ సైకిల్‌ను రాజమహేంద్రవరానికి చెందినఓ స్నేహితుడు చైనా నుంచి రప్పించాడని  సైకిల్‌ యజమాని మహేష్‌ తెలిపారు. మోటారు సైకిల్‌ మాదిరిగానే దీనికి కూడా ఐదు గేర్లు ఉన్నాయని, చూసేందుకు భారీగా కనిపిస్తున్నా రన్నింగ్‌లో ఎంతో సౌకర్యవంతంగా ఉందని ఆయన తెలిపారు.  – తాళ్లరేవు

 

 

Advertisement
 
Advertisement
Advertisement