సూది 'ఎఫెక్ట్'.. భయంతో ఆస్పత్రిలోచేరిన వ్యక్తి | needle psycho Effect | Sakshi
Sakshi News home page

సూది 'ఎఫెక్ట్'.. భయంతో ఆస్పత్రిలోచేరిన వ్యక్తి

Sep 13 2015 4:46 PM | Updated on Sep 3 2017 9:20 AM

సూది సైకో గురించిన పుకార్లు పెరిగి పోతుండటంతో జనం భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. ఏమూల నుంచి సూది సైకో తమ మీద దాడి చేస్తాడో అని వణికి పోతున్నారు. తాజాగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో సూదితో తనపై దాడి చేశారంటూ ఓ వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు

సూది సైకో గురించిన పుకార్లు పెరిగి పోతుండటంతో జనం భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. ఏమూల నుంచి సూది సైకో తమ మీద దాడి చేస్తాడో అని వణికి పోతున్నారు. తాజాగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో సూదితో తనపై దాడి చేశారంటూ ఓ వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. బాధితుడి కధనం మేరకు.. వట్లూరు గ్రామానికి చెందిన దుక్కిపాటి కృష్ణ(30) ఆదివారం ఏలూరు పట్టణానికి వచ్చి తిరిగి ఆటోలో స్వగ్రామానికి బయలు దేరాడు. ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి తన చేతిపై సూదితో గుచ్చి పరారయ్యాడని తెలిపాడు. సదరు వ్యక్తి వస్త్రంతో ముఖం కప్పుకున్నాడు. అయితే చేతిపై గాయం సూదిదా.. కాదా.. అనే విషయాన్ని వైద్యులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.


 

Advertisement
 
Advertisement
Advertisement