ఎలుక నా కష్టాన్ని భగ్నం చేసింది: కామినేని | Kamineni comments on rats | Sakshi
Sakshi News home page

ఎలుక నా కష్టాన్ని భగ్నం చేసింది: కామినేని

Jan 10 2016 2:08 AM | Updated on Sep 3 2017 3:23 PM

ఎలుక నా కష్టాన్ని భగ్నం చేసింది: కామినేని

ఎలుక నా కష్టాన్ని భగ్నం చేసింది: కామినేని

ఒక్క ఎలుక తన కష్టాన్ని భగ్నం చేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు.

సాంబమూర్తినగర్ (కాకినాడ): ఒక్క ఎలుక తన కష్టాన్ని భగ్నం చేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. గుంటూరు ఆస్పత్రిలో ఎలుకల దాడిలో పసికందు మృతిచెందిన విషాదాన్ని గుర్తు చేస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. శనివారం తూర్పు గోదావరి కాకినాడలో జిల్లా రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (రామ్‌కోసా) సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను మోకాలి ఆపరేషన్ కాకినాడలో చేయించుకోవాలని అనుకున్నానని, తనపై పడ్డ మచ్చను తొలగించుకునేందుకు గుంటూరు ఆస్పత్రిలోనే చేయించుకుంటానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement