‘శత జయంతి’లోనూ రాజకీయమా? | jc prabhakar reddy Fire | Sakshi
Sakshi News home page

‘శత జయంతి’లోనూ రాజకీయమా?

Aug 22 2016 10:52 PM | Updated on Oct 30 2018 5:04 PM

‘శత జయంతి’లోనూ రాజకీయమా? - Sakshi

‘శత జయంతి’లోనూ రాజకీయమా?

వందేళ్ల ఘన చరిత్ర ఉన్న ఆర్ట్స్‌ కళాశాల శత జయంతి ఉత్సవాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా నిర్వహించాలని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. కొందరు నాయకులు ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సోమవారం నగరంలోని దివాకర్‌ట్రావెల్స్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

  • ఆర్ట్స్‌ కళాశాల వేడుకల నిర్వాహణ వ్యవహారంపై  జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపాటు
  • వందేళ్ల ఘన చరిత్ర ఉన్న ఆర్ట్స్‌ కళాశాల శత జయంతి ఉత్సవాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా నిర్వహించాలని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు.  కొందరు నాయకులు ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సోమవారం నగరంలోని దివాకర్‌ట్రావెల్స్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ రంగు పులిమి సొంత కమిటీలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాల ప్రతిష్ట దెబ్బతీసేలా చేస్తే సహించేది లేదన్నారు. పూర్వ విద్యార్థులు, కళాశాల పూర్వ అధ్యాపకులు, ప్రస్తుత అధ్యాపకులు, కళాశాలలో చదివి వివిధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ సమావేశపరచి శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు.   ఏదిఏమైనా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు.  
     

Advertisement
 
Advertisement
Advertisement