ఆచూకీ తెలపండి | identify this head | Sakshi
Sakshi News home page

ఆచూకీ తెలపండి

Jul 27 2016 9:48 PM | Updated on Apr 3 2019 5:32 PM

తాడేపల్లి (తాడేపల్లిరూరల్‌) : ‘నిందితుల ఆచూకీ తెలపండి.. పోలీసులకు సహకరించండి’.. అంటూ మంగళగిరి రూరల్‌ డీఎస్పీ రామాంజనేయులు బుధవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  •  పోలీసులకు సహకరించండి
  • డీఎస్పీ రామాంజనేయులు 
  • తాడేపల్లి (తాడేపల్లిరూరల్‌) : ‘నిందితుల ఆచూకీ తెలపండి.. పోలీసులకు సహకరించండి’.. అంటూ మంగళగిరి రూరల్‌ డీఎస్పీ రామాంజనేయులు బుధవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తిని అతి కిరాతకంగా మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన అందరికీ తెలిసిందే.

    చనిపోయిన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొండెం నుంచి  తల వేరైన వ్యక్తి ముఖ చిత్రాలను ఆయన విడుదల చేశారు. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం తెలిసిన వారు 94407 96216, లేదా 94407 96392 నంబర్లకు వివరాలు ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement