ఉత్సాహంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ | football match | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌

Jan 4 2017 9:40 PM | Updated on Sep 5 2017 12:24 AM

ఉత్సాహంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌

ఉత్సాహంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌

ఏలూరు రూరల్‌ : ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఫ్లో పుట్‌బాల్‌ మ్యాచ్‌ అభిమానులను ఉర్రూతలూగించింది

ఏలూరు రూరల్‌ : ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఫ్లో పుట్‌బాల్‌ మ్యాచ్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. తణుకు, ఏలూరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ ఆద్యంతం అలరించింది. ఈ మ్యాచ్‌లో ఏలూరు జట్టు 2–1 తేడాతో తణుకు జట్టుపై విజయం సాధించింది.  దీంతో ఏలూరు జట్టుకు రెండో విజయం దక్కగా తణుకు జట్టు నాలుగోసారి ఓటమిపాలైంది. ఇరుజట్లు ఆటగాళ్లు ఆట మొత్తం దూకుడుగా ఆడడంతో మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన వందలాది పాఠశాల పిల్లలు, అభిమానులు ఆసక్తిగా తిలకించారు. మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌ క్రీడాకారుడు లొఫొకు దక్కింది. గురువారం గణపవరంలో తాడేపల్లిగూడెం, భీమవరం జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుందని జిల్లా పుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బెల్లంకొండ సుబ్బారావు చెప్పారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement