పీడీలకు శారీర దారుఢ్య పరీక్షలు | fitness tests for PD posts | Sakshi
Sakshi News home page

పీడీలకు శారీర దారుఢ్య పరీక్షలు

Sep 8 2016 9:47 PM | Updated on Apr 4 2019 5:41 PM

ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల కోసం శారీర దారుఢ్య పరీక్షలు నిర్వహించామని డీఎస్‌డీఓ హరినాథ్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

సంగారెడ్డి టౌన్‌: జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల కోసం  డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మైదానంలో శారీర దారుఢ్య పరీక్షలు నిర్వహించామని డీఎస్‌డీఓ హరినాథ్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 94 మంది పురుషులు, 12 మహిళా అభ్యర్థులు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో పీడీ సురేందర్‌ సింగ్, వ్యాయామ ఉపాధ్యాయులు మశ్చెందర్, దుర్గాప్రసాద్, కిష్టయ్య, జిమ్నాస్టిక్‌ కోచ్‌ దేవిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement