ఇచట సినిమా దుస్తులు అమ్మబడును | filmstar dresses are available at livastar website | Sakshi
Sakshi News home page

ఇచట సినిమా దుస్తులు అమ్మబడును

Oct 7 2016 9:19 PM | Updated on Sep 4 2017 4:32 PM

ఇచట సినిమా దుస్తులు అమ్మబడును

ఇచట సినిమా దుస్తులు అమ్మబడును

‘స్టార్‌’ దుస్తుల ఫ్యాషన్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన వెబ్‌సైట్లలో లివాస్టార్‌ ఒకటి.

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో బన్నీ వేసుకున్న ట్రౌజర్‌ అదిరిపోయింది కదరా... అచ్చం అలాంటిది దొరికితే ఎంతైనా పెట్టి కొనేస్తాను అంటాడో కుర్రాడు. ‘‘జనతా గ్యారేజ్‌’ మూవీలో సమంత వేసుకున్న టాప్‌ చాలా బాగుందే. వాళ్లకి అలాంటివి దొరుకుతాయి. మనకెందుకు దొరకవు? అంటూ నిట్టూరుస్తుందో యువతి. అయితే ఇలాంటి సరదాలు తీర్చడానికి ఇప్పుడు కొన్ని వెబ్‌సైట్లు సిద్ధమయ్యాయి. చెర్రీలా దుస్తుల్లో చెలరేగాలనుకునే చిన్నోళ్లు... తమన్నాలా త‘లుక్‌’మనాలనుకునే తరుణీమణులూ... బీరెడీ.
                             – శిరీష చల్లపల్లి

తెరపై కథానాయికలు ధరించే అందమైన చీరలు, డ్రెస్సులు జీవితంలో ఒక్కసారైనా మనం వేసుకోగలమా? అని ఆలోచించే అమ్మాయిలు... లైఫ్‌ అంటే హీరోలదే... మనకా అదృష్టం లేదని చింతించే అబ్బాయిలూ ఉన్నారు. అలాంటి వాళ్లను చూసి ‘వీరి సినిమా పిచ్చి  తగలెయ్య..’ అనుకుంటూ నవ్వుకోవడం నిన్నటిమాట.. ఇప్పుడు సీన్‌ మారిపోయింది. తమకి ఇష్టమైన సినిమాల్లో, రియాలిటీ షోలో... తమ ప్రియ హీరోయిన్‌/హీరో ఫలానా సీన్‌/పాటలో... ధరించిన  డ్రెస్‌ వేసుకోవాలని అనిపించడమే ఆలస్యం.. ఒక్క క్లిక్‌తో అవి ఒంటి మీద వాలుతున్నాయి.

హవా స్టైల్‌... లివాస్టార్‌
‘స్టార్‌’ దుస్తుల ఫ్యాషన్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన వెబ్‌సైట్లలో లివాస్టార్‌ ఒకటి. లివాస్టార్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మనకు కావాల్సిన సినిమా డ్రెస్సింగ్‌ స్టైల్ ని ఫొటోతో సహా వారికి పోస్ట్‌ చేయాలి. వెంటనే రిప్లై మెసేజ్‌ వస్తుంది. అలా మీ టెస్ట్‌కు తగ్గట్టూ, సైజును బట్టి మీరు కోరుకున్న స్టార్‌ కాస్ట్యూమ్‌ నాలుగు రోజుల్లో కళ్ల ముందుంటుంది. హీరో, హీరోయిన్‌లు ధరించిన కాస్ట్యూమ్స్‌ మీ సైజ్‌కు తగ్గట్టుగా రెడీమేడ్‌గా డెలివరీ          అయిపోతాయి. కేవలం దుస్తులు మాత్రమే కాదు సినిమా స్టార్స్‌ ధరించే యాక్ససరీస్, ఆభరణాలు, రిస్ట్‌వాచ్‌లు సైతం ఈ తరహా వెబ్‌సైట్స్‌లో ఆర్డర్‌ చేయొచ్చు.

‘డ్రెస్‌’ చెబుతారు
కొంతమందికి కొన్ని సినిమాల్లో డ్రెస్‌లు నచ్చినా ఆ తర్వాత అవి ఎక్కడ చూశామో గుర్తుండకపోవచ్చు. అలాంటి వారు ఫలానా హీరోయిన్‌/హీరో పేరుని పోస్ట్‌ చేస్తే వారికి సంబంధించి, వారు ధరించగా హిట్‌ అయిన ఫ్యాషన్‌ కలెక్షన్స్‌ డిస్‌ప్లే చేస్తారు. స్క్రీన్‌ మీద కనిపిస్తున్న వాటిలో కావాల్సిన కాస్ట్యూమ్‌ని సెలెక్ట్‌ చేసుకోవచ్చు. స్టార్స్‌ దుస్తులు మక్కీకి మక్కీ కావాలనుకునేవారు కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. యాక్టర్స్‌ రేంజ్‌లో డ్రెస్‌ వేసుకోవాలంటే ఆ మాత్రం తప్పదు కదా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement