సచిన్.. నీ ఊరు ఓసారి చూడవూ! | fevers spreading in sachin tendulkar's adopted village | Sakshi
Sakshi News home page

సచిన్.. నీ ఊరు ఓసారి చూడవూ!

Oct 21 2015 2:52 PM | Updated on Sep 3 2017 11:18 AM

సచిన్.. నీ ఊరు ఓసారి చూడవూ!

సచిన్.. నీ ఊరు ఓసారి చూడవూ!

లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ గ్రామంలో అంతా విషజ్వరాలు వ్యాపించాయి.

సెలబ్రిటీలు ఊళ్లను దత్తత తీసుకోవడం శ్రీమంతుడు సినిమా కంటే ముందునుంచే ఉంది. లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎప్పుడో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆ ఊళ్లో అంతా విషజ్వరాలు వ్యాపించాయి. అక్కడ తాగునీరు కలుషితం కావడంతో ఈ విషజ్వరాలు వ్యాపించాయని అంటున్నారు.

ఈ జ్వరాలతోను, తాగేందుకు నీళ్లు కూడా సరిగా అందుబాటులో లేకపోవడంతోను గ్రామ ప్రజలు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. అయితే, తాను దత్తత తీసుకున్న గ్రామంలో ఈ దుస్థితి ఉందన్న విషయం సచిన్ టెండూల్కర్‌కు తెలియకపోవచ్చు. అధికారులు కూడా ఇక్కడి పరిస్థితిని పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు. కనీసం సచిన్ దృష్టికి ఈ సమస్య వెళ్తేనైనా తమ కష్టాలు గట్టెక్కుతాయని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement