ధన్‌సింగ్‌ సేవలు మరువలేనివి | Dhansingh services memorable | Sakshi
Sakshi News home page

ధన్‌సింగ్‌ సేవలు మరువలేనివి

Aug 16 2016 10:18 PM | Updated on Sep 4 2017 9:31 AM

ధన్‌సింగ్‌కు నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌

ధన్‌సింగ్‌కు నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌

టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈగా పనిచేసిన ధన్‌సింగ్‌ సేవలు మరువలేనివని ఖమ్మం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

ఖమ్మం: టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈగా పనిచేసిన ధన్‌సింగ్‌ సేవలు మరువలేనివని ఖమ్మం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం ఖమ్మంలోని ఎంబీ ఫంక్షన్‌ హాల్‌లో ఎస్‌ఈ ధన్‌సింగ్‌  పెద్దకర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధన్‌సింగ్‌ విద్యుత్‌శాఖకు చేసిన సేవలను కొనియాడారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యుత్‌శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement