నారాయణపేటను జిల్లా చేయాలి | Demand for Narayanapeta district | Sakshi
Sakshi News home page

నారాయణపేట, జిల్లా చేయాలి, జలసాధన సమితి

Sep 12 2016 11:46 PM | Updated on Sep 4 2017 1:13 PM

నారాయణపేట : జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక న్యూ గంజ్‌ దగ్గర నారాయణపేటను జిల్లా చేయాలని నల్లగుడ్డలను నొటికి కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

నారాయణపేట : జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక న్యూ గంజ్‌ దగ్గర నారాయణపేటను జిల్లా చేయాలని నల్లగుడ్డలను నొటికి కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ‘పేట’ మార్కెట్‌ యార్డు నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తున్న మంత్రులు జూపల్లి కృష్ణరావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి అక్కడికి చేరుకుని ప్రజాప్రాయం ప్రకారమే జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నారాయణపేటకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి కన్వీనర్‌ మనోహర్‌గౌడ్, సభ్యులు నాగూరావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, నింగిరెడ్డి, సరాఫ్‌కృష్ణ, సుదర్శన్‌రెడ్డి, సిద్రామప్ప, ఓంప్రకాశ్, సత్యయాదవ్, కెంచె నారాయణ, కుంటిమారి వెంకటయ్య, కృష్ణ, బోయలక్ష్మణ్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement