గంజాయి కేసులో క్రికెట్‌ బుకీ అరెస్ట్‌ | Cricket bookie arrested in marijuana case | Sakshi
Sakshi News home page

గంజాయి కేసులో క్రికెట్‌ బుకీ అరెస్ట్‌

Jan 17 2017 11:46 PM | Updated on Sep 5 2017 1:26 AM

గంజాయి కేసులో క్రికెట్‌ బుకీ అరెస్ట్‌

గంజాయి కేసులో క్రికెట్‌ బుకీ అరెస్ట్‌

కడప నగర శివార్లలోని రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో స్పోర్ట్స్‌ స్కూల్‌ సమీపంలో యెల్లాల మహ్మద్‌ గౌస్‌ అనే క్రికెట్‌ బుకీ గంజాయి విక్రయిస్తుండగా అరెస్ట్‌ చేసినట్లు రిమ్స్‌ సీఐ మోహన్‌ ప్రసాద్‌ తెలిపారు.

కడప అర్బన్‌ : కడప నగర శివార్లలోని రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో స్పోర్ట్స్‌ స్కూల్‌ సమీపంలో యెల్లాల మహ్మద్‌ గౌస్‌ అనే క్రికెట్‌ బుకీ గంజాయి విక్రయిస్తుండగా అరెస్ట్‌ చేసినట్లు రిమ్స్‌ సీఐ మోహన్‌ ప్రసాద్‌ తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన మహ్మద్‌ గౌస్‌ అనేక సంవత్సరాలుగా క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడేవాడు. ప్రస్తుతం క్రికెట్‌ బెట్టింగ్‌కు జిల్లాలో బ్రేక్‌ పడటంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో గంజాయిని విక్రయిస్తుండగా తమకు సమాచారం రావడంతో అరెస్ట్‌ చేశామన్నారు. అతని వద్ద నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టు చేసేందుకు కృషి చేసిన ఎస్‌ఐ హేమాద్రిని అభినందించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement