క్రీడానందం.. ‘ఖోఖో’ల్లలు | " coco' state level games | Sakshi
Sakshi News home page

క్రీడానందం.. ‘ఖోఖో’ల్లలు

Oct 26 2016 10:18 PM | Updated on Sep 4 2017 6:23 PM

క్రీడానందం.. ‘ఖోఖో’ల్లలు

క్రీడానందం.. ‘ఖోఖో’ల్లలు

భీమడోలు : స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం 36వ రాష్ట్రస్థాయి ఖోఖో జూనియర్‌ బాలురు, బాలికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఈ పోటీలను ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు.

 భీమడోలు : స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం 36వ రాష్ట్రస్థాయి ఖోఖో జూనియర్‌ బాలురు, బాలికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఈ పోటీలను ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. జిల్లాస్థాయి ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 312 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తొలుత వివిధ  జిల్లాల క్రీడాకారుల మార్చ్‌ఫాస్ట్‌ ఉత్సాహంగా సాగింది. తొలిరోజు విజేతల వివరాలను జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు ఇ.సాంబ శివరావు, ఎంఈవో గారపాటి ప్రకాశరావు, కోశాధికారి ప్రసాదరెడ్డి తెలిపారు. 
బాలికల విభాగంలో విజేతలు వీరే..  
పశ్చిమగోదావరి–నెల్లూరు, ప్రకాశం–తూర్పుగోదావరి మ«ద్యృ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. శ్రీకాకుళంపై అనంతపురం, కృష్ణాజిల్లా జట్టుపై విజయనగరం, చిత్తూరుపై విశాఖపట్నృ విజయం సాధించాయి. 
బాలుర విభాగం :  
తూర్పుగోదావరిపై చిత్తూరు, అనంతపురంపై పశ్చిమ గోదావరి, గుంటూరుౖపై విశాఖపట్నం, కర్నూలుపై ప్రకాశం, కృష్ణాపై విజయనగరం విజయం సాధించాయి. 
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement