‘చికెన్’ లొల్లి.. భర్త ఆత్మహత్య | clash between husband and wife for chicken | Sakshi
Sakshi News home page

‘చికెన్’ లొల్లి.. భర్త ఆత్మహత్య

Jul 14 2015 9:18 AM | Updated on Jul 27 2018 2:18 PM

‘చికెన్’ లొల్లి.. భర్త ఆత్మహత్య - Sakshi

‘చికెన్’ లొల్లి.. భర్త ఆత్మహత్య

ర్యతో గొడవ పడి భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

జగద్గిరిగుట్ట: భార్యతో గొడవ పడి భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం కూకట్‌పల్లి రామకృష్ణానగర్‌లో నివాసం ఉండే కారు డ్రైవర్ మధు(27) ఆదివారం సినిమాకు వెళ్లి వచ్చాడు. సాయంత్రం చికెన్ తీసుకురమ్మని భార్య జ్యోతితో గొడవ పడ్డాడు.

ఆమె డబ్బులు లేవని చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకుంది. అనంతరం చికెన్ తెచ్చేందుకు జ్యోతి బయటకు వెళ్లింది. తిరిగి వచ్చే సరికి మధు ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో స్థానికులు సహాయంతో మధును ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement