బోనం శోభాయమానం | bonalu held grandly in old city | Sakshi
Sakshi News home page

బోనం శోభాయమానం

Jul 31 2016 10:50 PM | Updated on Sep 4 2018 5:21 PM

బోనం శోభాయమానం - Sakshi

బోనం శోభాయమానం

పాతబస్తీ బోనమెత్తింది. పండుగ శోభతో కళకళలాడింది. శివసత్తుల పూనకాలతో ఊగిపోయింది.

సాక్షి, చార్మినార్‌: పాతబస్తీ బోనమెత్తింది. పండుగ శోభతో కళకళలాడింది. డప్పు వాద్యాలు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో ఊగిపోయింది. ప్రతి మార్గం యువకుల కేరింతలు, పలహారం బండ్ల ఊరేగింపుతో నిండిపోయింది. ఆదివారం ప్రసిద్ధ లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా నిర్వహించారు. తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు అనంతరం బోనాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. పలువురు ప్రముఖులు పూజల్లో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement