అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం | applications invited for the post of lecturers | Sakshi
Sakshi News home page

అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Aug 21 2016 12:14 AM | Updated on Aug 20 2018 3:21 PM

హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల్లో డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు పలు సబ్జెక్టుల స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ వై.బాలయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

విద్యారణ్యపురి : హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల్లో డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు పలు సబ్జెక్టుల స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ వై.బాలయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తులు బీఈడీ కళాశాలలో సమర్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ల యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న స్కూల్‌అసిస్టెంట్‌లు అర్హులని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలిలా ఉన్నాయి. ఫిలాసఫీ 1, సైకాలజీ 1, సోషియాలజీ 1, ఫిజికల్‌సైన్స్‌ 1, బయోలాజికల్‌ సైన్స్‌ 1, మ్యాథమెటిక్స్‌ 2, సోషల్‌సైన్స్‌ 1, తెలుగు 1, ఇంగ్లిష్‌ 2, కంప్యూటర్‌ ఎడ్యూకేషన్‌ 1, ఫిజికల్‌ డైరెక్టర్‌ 1, ఆర్ట్‌ ఎడ్యూకేషన్‌ 1 ఉన్నాయి. ఆయా సబ్జెక్టుల్లో పీజీ ఎంఈడీలో కనీసం 55 శాతం మార్కులు కలిగి ఉండాలని వివరించారు. సదరు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, ఎంఈఓ ఆమోదంతో రేషనలైజేషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement