ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు | action for posts fillup in health department | Sakshi
Sakshi News home page

ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు

Aug 14 2016 1:55 AM | Updated on Sep 4 2017 9:08 AM

ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు

ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్యశాఖ రీజనల్‌ డైరక్టర్‌ డాక్టర్‌ దశరథరామయ్య తెలిపారు.

మహానంది : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్యశాఖ రీజనల్‌ డైరక్టర్‌ డాక్టర్‌ దశరథరామయ్య తెలిపారు. మహానందీశ్వరుడి దర్శనార్థం శనివారం ఆయన మహానందికి వచ్చారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ పాణ్యం ప్రసాదరావు, ఎంపీహెచ్‌ఈఓ హుసేన్‌రెడ్డిలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉందన్నారు.  ఇప్పటిఏ ప్రతి జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీల భర్తీకి చర ్యలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఒక డాక్టర్, స్టాఫ్‌నర్సు, ఏఎన్‌ఎంలను నియమించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement