వీడియో చూస్తూ ప్రసవానికి యత్నం | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. వీడియో చూస్తూ ప్రసవానికి యత్నం

Published Tue, Mar 12 2019 10:24 AM

Unmarried Woman Watches Video on How to Deliver Baby - Sakshi

లక్నో : వీడియో చూస్తూ సొంతంగా ప్రసవానికి ప్రయత్నించిన ఓ 25 ఏళ్ల యువతి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని  గోరఖ్‌పూర్‌ పరిధిలో చోటుచేసుకుంది. బహ్రయిచ్‌ ప్రాంతానికి చెందిన సదరు యువతి గత నాలుగేళ్లుగా గోరఖ్‌పూర్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో వివాహేతర సంబంధంతో గర్భం దాల్చింది. ఈ విషయం ఎవరికి తెలియవద్దని గదిలో ఒంటరిగా వీడియో చూస్తూ ప్రసవానికి ప్రయత్నించింది. ఇది వికటించడంతో తీవ్ర రక్తస్రావానికి గురై ప్రాణాలు కోల్పోయింది.

ఇటీవలనే కొత్త గదిని ఆమె అద్దెకు తీసుకోగా.. ఆదివారం  ఆ రూమ్‌ నుంచి రక్తం రావడం చుట్టూ పక్కల వాళ్లు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు రక్తంమడుగులో ఉన్న పసికందును, యువతిల మృతదేహాలను ఆసుపత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు. యువతి కుటుంబ సభ్యులెవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. ఆ యువతి ఎవరితో సంబంధం పెట్టుకున్న విషయం కూడా తెలియరాలేదన్నారు.

Advertisement
Advertisement