వివాహితను రక్షించబోయి..ప్రాణాలు కోల్పోయాడు | Two Men Go Missing While Trying To Save A Drowning Woman In Ryves Canal | Sakshi
Sakshi News home page

కాల్వలో దూకిన వివాహితను రక్షించబోయి గల్లంతు

Aug 20 2019 5:34 PM | Updated on Aug 20 2019 6:09 PM

Two Men Go Missing While Trying To Save A Drowning Woman In Ryves Canal - Sakshi

సాక్షి, విజయవాడ: వివాహితను రక్షించబోయి ఇద్దరు యువకులు గల్లంతు అయిన ఘటన విజయవాడలోని గుణదలలో చోటుచేసుకుంది. గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే... గుణదలకు చెందిన రాణి అనే ఓ మహిళ మంగళవారం గుణదల రైవస్‌ కాల్వలో దూకేసింది.  అదే సమయంలో అక్కడ ఉన్న అయిదుగురు యువకులు గమనించి ఆమెను రక్షించేందుకు కాలువలోకి దూకారు. వీరిలో ముగ్గురు యువకులు రాణిని రక్షించి బయటకు తీసుకొని రాగా, మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. కాగా గల్లంతైన యువకులను వడుగు  శివరామకృష్ణ (నాని), తాడేపల్లి సాయి అజయ్‌గా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం కాలువలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. గాలింపులో భాగంగా గల్లంతు అయిన శివరామకృష్ణ మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం ఇవాళ సాయంత్రం ఒడ్డుకు చేర్చింది. మహిళను రక్షించబోయి ప్రాణాలు పోగొట్టుకున్న శివరామకృష్ణ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యుల కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement