కేపీహెచ్‌బీలో వ్యభిచార ముఠా గుట్టురట్టు | Prostitution Gang Arrest in KPHB Hyderabad | Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠా గుట్టురట్టు

Jan 27 2020 10:48 AM | Updated on Jan 27 2020 10:48 AM

Prostitution Gang Arrest in KPHB Hyderabad - Sakshi

కేపీహెచ్‌బీకాలనీ:  కేపీహెచ్‌బీ పోలీసులతో కలిసి మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఆదివారం వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు.  పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ రోడ్‌ నంబర్‌–1లోని ఎమ్‌ఐజీ–59లోని ఫ్లాట్‌ నంబర్‌–202లో యూనివర్సల్‌ హెయిర్‌ అండ్‌ స్పా నిర్వహిస్తున్నారు.ఆన్‌లైన్‌లో విటులను ఆకర్శించి వ్యభిచారం చేయిస్తున్నారు. మసాజ్‌ పేరుతో ఈ తతంగం నిర్వహిస్తున్నారు. విటుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆదివారం స్పాపై దాడి చేసిన పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న ఆరుగురు యువతులను రెస్క్యూహోమ్‌కు తరలించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కోర్టు ఎదుట హాజరుపరిచారు. నిందితుల  నుంచి రూ.1.36 లక్షల నగదు, 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement