బాలికపై అత్యాచారం | Molestation on Girl Child in Mahabubnagar | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం

Jul 23 2020 11:24 AM | Updated on Jul 23 2020 11:24 AM

Molestation on Girl Child in Mahabubnagar - Sakshi

ఆత్మకూర్‌: మైనర్‌బాలికను అత్యాచారం చేసిన యువకుడిని బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాలను బుధవారం ఆత్మకూర్‌లో అడిషనల్‌ ఎస్పీ షాకీర్‌హుస్సేన్, సీఐ సీతయ్య సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన కిరాణషాపు యజమాని చందు(22) సోమవారం రాత్రి 8:0 గంటల ప్రాంతంలో బాలిక షాపులో కొనుగోలు కోసం వచ్చింది. ఇదే అదునుగా భావించిన యువకుడు బాలికను బలవంతంగా షాపులోకి తీసుకెళ్లి షెట్టర్‌వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక మంగళవారం మధ్యాహ్నం తల్లితండ్రులకు తెలిపింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆత్మకూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం నిందితుడిని అరెస్ట్‌ చేసి 376, ఫోక్సోచట్టం, ఎస్సీఎస్టీ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement