కుమార్తెపై లైంగికదాడికి యత్నం | Molestation On Daughter hyderabad | Sakshi
Sakshi News home page

కుమార్తెపై లైంగికదాడికి యత్నం

Aug 29 2018 9:08 AM | Updated on Sep 4 2018 5:44 PM

Molestation On Daughter hyderabad - Sakshi

రసూల్‌పురా: కన్న తండ్రే కుమార్తెపై లైంగికదాడికి యత్నించిన సంఘటన బోయిన్‌పల్లి పీఏస్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  దిల్‌కుష్‌నగర్‌కు చెందిన సమీర్‌షరీఫ్‌ పాత నేరస్తుడు. గతంలో ఇతను జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో రేప్‌ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అతడిని మొదటి భార్య వదిలివేయడంతో ఫాతిమా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఈ నెల 23న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెద్ద కుమార్తె(11)పై లైంగికదాడికి యత్నించాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన ఫాతిమా కుమార్తెను రక్షించి స్థానికులకు సమాచారం అందించడంతో వారు అతడిని చితకబాదగా నిందితుడు తప్పించుకుని పారిపోయాడు.  సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Advertisement
 
Advertisement
Advertisement