అమెరికాలో కాల్పులు ఆరుగురు మృతి | Jersey City Shooting Leaves Six People Dead | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు ఆరుగురు మృతి

Dec 12 2019 2:38 AM | Updated on Dec 12 2019 2:38 AM

Jersey City Shooting Leaves Six People Dead - Sakshi

జెర్సీ సిటీ: అమెరికా న్యూజెర్సీ నగరంలో తుపాకీ విష సంస్కృతి మరోసారి చెలరేగింది. మంగళవారం రాత్రి నగర వీధుల్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు సాధారణ పౌరులు కాగా, ఒక పోలీసు అధికారి, కాల్పులకు తెగబడిన ఇద్దరు దుండగులు ఉన్నారు. దుండగులు యూదులకు చెందిన కొషర్‌ సూపర్‌ మార్కెట్‌ని లక్ష్యంగా చేసుకున్నట్టు నగర మేయర్‌ స్టీవెన్‌ చెప్పారు. ఇది ఉగ్రవాదుల దాడి కాదని, కేవలం యూదుల్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు దిగారని, పోలీసులు వారిని హతం చేశారని ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement