భర్త వేధింపులు తాళలేక గర్భిణి బలవన్మరణం  | husband harassment pregnant suicide | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులు తాళలేక గర్భిణి బలవన్మరణం 

Apr 19 2018 12:51 PM | Updated on Nov 6 2018 8:16 PM

husband harassment pregnant suicide - Sakshi

హారిక(ఫైల్‌)

ముస్తాబాద్‌(సిరిసిల్ల): కలకాలంతోడు నీడగా ఉంటాడనుకున్న భర్త.. పెళ్లయిన కొద్దిరోజులకే వేధింపులకు గురిచేశాడు. అయినా సర్దుకుపోయింది. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో.. లోకం కూడా చూడని బిడ్డతోపాటు బలవన్మరణానికి పాల్పడింది. గంభీరావుపేట ఎస్సై లక్ష్మారెడ్డి, మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు..

ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌కు చెందిన నాంపెల్లి, లక్ష్మి దంపతుల నాలుగో కూతురు హారిక(25)కు ఆరేళ్ల క్రితం గంభీరావుపేట మండలం ముచ్చర్లకు చెందిన ఆవునూరి చిరంజీవులతో వివాహం జరిపించారు. వీరికి హర్షవర్ధన్‌(5) కొడుకు ఉన్నాడు. కొద్ది సంవత్సరాలు బాగానే ఉన్న వారి దాంపత్యంలో కలహాలు మొదలు అయ్యాయి.

మంగళవారం రాత్రి కూడా ఇద్దరిమధ్య గొడవ జరిగింది. దీంతో ఎనిమిది నెలల నిండు గర్భిణీ అయిన హారిక ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ముస్తాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. కాగా తన కూతురును చిరంజీవులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని నాంపెల్లి పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement