తండ్రి మందలించాడని.. | Boy Escape From Home in Medak | Sakshi
Sakshi News home page

తండ్రి మందలించాడని.. ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకు

Jun 1 2020 7:56 AM | Updated on Jun 1 2020 7:56 AM

Boy Escape From Home in Medak - Sakshi

వెంకట దత్త హనుమంత(ఫైల్‌)

పటాన్‌చెరు టౌన్‌ : వీడియో గేమ్స్‌ ఆడుతున్న కుమారుడిని ఓ తండ్రి మందలించడంతో ఇంటి నుంచి కుమారుడు వెళ్లిపోయిన ఘటన అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామానికి చెందిన సుకుమార్‌ వంటల మాస్టర్‌గా పనిచేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. కాగా ఇతడికి 6వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలుడు వెంకట్‌ దత్త హనుమంత కలడు.ఈ క్రమంలో బుధవారం కుమారుడు ఇంట్లో వీడియో గేమ్స్‌ ఆడుతుండటంతో తండ్రి సుకుమార్‌ మందిలించాడు. దీంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా అదే రోజు సాయంత్రం వెంకట్‌ దత్త వెళ్లిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, చుట్టు పక్కన వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో కొడుకు అదృశ్యం పై తండ్రి సుకుమార్‌ అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement