షావోమి మరో బడ్జెట్‌ ఫోన్‌...ఫీచర్స్‌ అదుర్స్‌ | Xiaomi Redmi S2 Launch Expected on May 10 | Sakshi
Sakshi News home page

షావోమి మరో బడ్జెట్‌ ఫోన్‌..ఫీచర్స్‌ అదుర్స్‌

May 4 2018 4:19 PM | Updated on Nov 6 2018 5:26 PM

Xiaomi Redmi S2 Launch Expected on May 10   - Sakshi

సాక్షి, ముంబై:  చైనీస్ ఫోన్ తయారీదారు  షావోమి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్‌  చేయనుంది.  ఈ మేరకు చైనా వెబ్‌సైట్‌ వైబోలో ఒక టీజర్‌ను రిలీజ్‌ చేసింది.  రెడ్‌మి ఎస్‌2 పేరుతో  తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను మే 10 న  గా  చైనాలో  సన్నింగ్‌.కామ్‌(Suning.com) ద్వారా ప్రత్యేకంగా విడుదల  చేయనుంది. అదేరోజున ఇండియాలో లాంచ్‌ చేస్తుందని అంచనా.  అంతేకాదు రెడ్‌మి  నోట్‌ ప్రో 5, ఎం6 ఎక్స్‌ తరహాలోనే ఉండబోతోందని టీజర్‌ సూచిస్తోంది.  ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ ధరను సుమారు 11,700 రూపాయలుగా  నిర్ణయించవచ్చని  సమాచారం. దీంతో పాటు 10వేల రూపాయల లోపు ధరలో బేస్‌  మోడల్‌ను కూడా లాంచ్‌ చేయనుందట.

రెడ్‌మి ఎస్‌2 ఫీచర్లపై అంచనాలు

5.99 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే (18: 9 రేషియో)
720x1440 పిక్సల్స్ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ ఓరియో
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 625 ఎస్‌వోసీ
3 జీబి ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌
12 ఎంపీ ప్రాధమిక సెన్సార్ , 5ఎంపీ సెకండరీ సెన్సార్
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
 

Advertisement
 
Advertisement
Advertisement