ఫోక్స్ వాగన్ పోలో జీటీ స్పోర్ట్స్ కార్లు వచ్చేశాయ్! | Volkswagen Polo GT Sport launched in India at Rs 7.91 lakh | Sakshi
Sakshi News home page

ఫోక్స్ వాగన్ పోలో జీటీ స్పోర్ట్స్ కార్లు వచ్చేశాయ్!

Apr 25 2017 2:47 PM | Updated on Sep 5 2017 9:40 AM

గతవారం ఫోర్డ్ లాంచ్ చేసిన ఫిగో స్పోర్ట్స్ వేరియంట్ అనంతరం జర్మన్ ఆటో దిగ్గజం ఫోక్స్ వాగన్ కూడా తన పాపులర్ మోడల్ పోలో జీటీలో స్పోర్ట్ వేరియంట్లను మార్కెట్ కు పరిచయం చేసింది.


గతవారం ఫోర్డ్ లాంచ్ చేసిన ఫిగో స్పోర్ట్స్ వేరియంట్ అనంతరం జర్మన్ ఆటో దిగ్గజం ఫోక్స్ వాగన్ కూడా తన పాపులర్ మోడల్ పోలో జీటీలో స్పోర్ట్ వేరియంట్లను మార్కెట్ కు పరిచయం చేసింది. పోలో జీటీ టీఎస్ స్పోర్ట్ తో పాటు, జీటీ టీడీఐ స్పోర్ట్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. పోలో జీటీ టీఎస్ఐ స్పోర్ట్ వేరియంట్ ధర రూ.7.91 లక్షలు(ఎక్స్ షోరూం, ముంబై) కాగ, జీటీ టీడీఐ ధర 9.81 లక్షల రూపాయలు.భారత్ లోని ఫోక్స్ వాగన్ డీలర్ షిప్ షోరూంలన్నింటిలోనూ ఈ రెండు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. 
 
ఇంటీరియర్,ఎక్స్ టీరియర్ అప్డేట్లతో ఈ కొత్త పోలో జీటీ స్పోర్ట్ వేరియంట్లను ఫోక్స్ వాగన్ రూపొందించింది. ఎక్స్ టీరియర్ అప్ డేట్లు : అంతా కొత్త గ్లోసీ బ్లాక్ స్పాయిరల్,16 అంగుళాల పోర్టాగో అలోయ్ వీల్స్, గ్లోసీ బ్లాక్ రూఫ్ ఫోయిల్, ఆకర్షణీయమైన జీటీ స్పోర్ట్ సైడ్ ఫోయిల్తో ఇది రూపొందింది.
 
ఈ కొత్త పోలో జీటీ స్పోర్ట్ వేరియంట్లు 1.2 లీటర్ల టీఎస్ఐ,1.5 లీటర్ల టీడీఐ ఇంజిన్ ను కలిగిఉన్నాయి. రెండు కలర్ వేరియంట్లో ఇది అందుబాటులోకి వచ్చింది. ఫ్లాష్ రెడ్, క్యాండీ వైట్ రంగుల్లో ఇది అన్ని ఫోక్స్ వాగన్ షోరూంలలో లభ్యం కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement