సుజుకి కొత్త గిక్సర్‌ బైక్స్‌ లాంచ్‌... | Suzuki Motorcycle launches 2018 series of Gixxer, Gixxer SF | Sakshi
Sakshi News home page

సుజుకి కొత్త గిక్సర్‌ బైక్స్‌ లాంచ్‌...

Mar 6 2018 5:45 PM | Updated on Mar 6 2018 5:51 PM

Suzuki Motorcycle launches 2018 series of Gixxer, Gixxer SF       - Sakshi

సాక్షి న్యూఢిల్లీ: సుజుకి మోటార్ కార్పొరేషన్‌కు  చెందిన సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా  గిక్సర్‌ సిరీస్‌లో కొత్త  మోడల్‌ బైక్‌లను లాంచ్‌ చేసింది.  2018 ఫ్లాగ్‌షిప్‌ మోటార్‌  సైకిల్‌ 2018 మోడల్స్‌ను మంగళవారం  విడుదల చేసింది. 2014లో లాంచ్‌ చేసిన గిక్సర్‌  బ్రాండ్‌కు చెందిన గిక్సర్‌ , గిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ పేరుతో  వీటిని  అందుబాటులోకి తెచ్చింది.  గిక్సర్‌ ధరను  రూ. 80,928, గిక్సర్‌  ఎస్‌ఎఫ్‌  ధరను రూ .90,037గా నిర్ణయించింది. వీటిల్లోసుజుకి ఎకో  పెర్‌ఫామెన్స్‌ టెక్సాలజీ (ఎస్‌ఈపి)  అల్ట్రా లైట్‌  155 సీసీ ఇంజీన్‌ అమర్చినట్టు  కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గిక్సర్‌  మోడల్స్‌ తమకు కీలకమైన ఉత్పత్తులని  సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్  సేల్స్ అండ్ మార్కెటింగ్  ప్రతినిధి సజీవ్ రాజశేఖరన్ చెప్పారు. వీటి పంపణీ ఇప్పటికే మొదలైందని దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌లలో  లభ్యమవుతాయని వెల్లడించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement