యూఎన్‌ఐడీఐఆర్‌ నేతృత్వంలో కొత్త వేదిక : ఏఐ కట్టడికి ఐరాస చొరవ | UN launches initiative to tackle military AI risks | Sakshi
Sakshi News home page

యూఎన్‌ఐడీఐఆర్‌ నేతృత్వంలో కొత్త వేదిక : ఏఐ కట్టడికి ఐరాస చొరవ

Oct 22 2026 4:26 PM | Updated on Oct 22 2026 4:32 PM

UN launches initiative to tackle military AI risks

జెనీవాలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో షురూ  

యునైటెడ్‌ నేషన్స్‌: సైనిక అవసరాల కోసం కృత్రిమ మేధను వినియోగించడాన్ని నియంత్రించేందుకు ఐక్యరాజ్య సమితి ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిస్‌ఆర్మమెంట్‌ రీసెర్చ్‌’ ఈ కార్యక్రమాన్ని ఒకట్రెండు రోజుల్లోనే మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అతివేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ మానవాళికి ముప్పుగా మారిందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. జెనీవా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ (యూఎన్‌ఐడీఐఆర్‌).. అధ్యక్షుడు రాబిన్‌ గైస్‌ మంగళవారం ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ అణ్వాయుధాలతోపాటు అనేక ఇతర అంశాల్లోనూ మానవ విచక్షణకు అవకాశాలు తగ్గిపోతున్నాయని, ఈ టెక్నాలజీ మనిషి చేతుల్లోంచి జారిపోయేందుకు ఎంత దగ్గరగా ఉందో అంచనా వేయడం కూడా సాధ్యం కావడం లేదని వివరించారు. అందుకే ఈ అనిశ్చితిని తొలగించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తెలిపారు. సమాచార సేకరణ, నిఘా, ముందస్తు హెచ్చరికల వ్యవస్థల్లో ఏఐ ఆందోళనకరమైన రీతిలో విస్తరిస్తోందని, ఏ దశలో వీటన్నింటిపై మనిషి నియంత్రణ తొలగిపోతుందో తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 

ఏఐ విషయంలో నియంత్రణ చర్యలు చేపట్టేందుకు చాలాకాలంగా విముఖత వ్యక్తమవుతోందని రాబిన్‌ గైస్‌ తెలిపారు. అయితే దాని సామర్థ్యాలు పెరిగిపోతూండటం, ప్రమాదాలపై సమాచారం స్పష్టమవుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ఇదే మంచి సమయమన్నారు. ఇతర రంగాలతోపాటు సైనిక అవసరాల విషయంలోనూ తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం పోటీ తీవ్రం అవుతూండటంతో నియంత్రణ చర్యలకు అడ్డంకులు పెరుగుతున్నట్లు ఐరాస గుర్తించిందన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు మారుతోందని అగ్రదేశాలు సైతం కట్టడి అవసరమని అభిప్రాయపడుతున్నాయని వివరించారు. ఏఐతో తలెత్తే ముప్పులు గత నెల జరిగిన ఐరాస వార్షిక సమావేశంలోనూ ప్రధాన చర్చనీయాంశంగా నిలిచిన విషయం తెలిసిందే. చాలా దేశాల నాయకులు తమ ప్రసంగాల్లో ఏఐ కట్టడి, రాగల ముప్పుపై ప్రస్తావించారు. 

ఇదీ చదవండి: రూ.800కి సేల్స్‌మేన్‌ ‌: క్లీనర్‌కి లంబోర్ఘిని ఇచ్చి, హైదరాబాదీ గొప్ప మనసు

 

 సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌... 
యూఎన్‌ఐడీఐఆర్‌ ఈ ఏడాది ఏఐ విషయంలో ఒక అత్యున్నత నైపుణ్య కేంద్రం (సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌)ను ఏర్పాటు చేసిందని, శాంతి, భద్రతల అంశాలపై దృష్టిసారించే శాశ్వత వేదిక ఇదేనని గైస్‌ తెలిపారు. ఐదు ప్రధాన అణ్వాయుధ దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఈ కేంద్రానికి నిధులు అందినట్లు చెప్పారు. ఏఐ కట్టడికి సంబంధించి ఈ కేంద్రంలో గురువారం సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనుందని తెలిపారు. కృత్రిమ మేధను సైనిక అవసరాల కోసం వినియోగించే అంశంపై పరిశోధించి తగు చర్యలు తీసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణలను ఈ ప్లాట్‌ఫామ్‌ ఒక చోటికి తీసుకు వస్తుందని వివరించారు. అయితే ఈ కార్యక్రమం నిర్దిష్టంగా ఏం చేస్తుందనే విషయంపై ఆయన స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement