సెల్ఫీ... సో ఈజీ! | selfie so easy with lava iris x1 | Sakshi
Sakshi News home page

సెల్ఫీ... సో ఈజీ!

Aug 4 2015 9:07 AM | Updated on Sep 3 2017 6:46 AM

సెల్ఫీ... సో ఈజీ!

సెల్ఫీ... సో ఈజీ!

సెల్ఫీ.. సెల్ఫీ. .సెల్ఫీ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మాట.

సాక్షి, హైదరాబాద్: సెల్ఫీ.. సెల్ఫీ. .సెల్ఫీ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మాట. ఈ 21వ శతాబ్దాన్ని తన మాయలో ముంచేసి, ప్రధానుల దగ్గర నుంచి సామాన్యుల వరకూ తమ ఆనందాలను పెంచుకునేలా చేస్తోంది ఈ సెల్ఫీ. అయితే కొన్ని పరిస్థితుల్లో సెల్ఫీ తీసుకునేటప్పుడు క్లిక్ బటన్‌పై వేలితో నొక్కడానికి అసౌకర్యంగా ఉంటుంది.

ఇప్పుడు ఆ అసౌకర్యాన్ని తగ్గించేలా.. కేవలం సెల్ఫీ తీసుకునేందుకు అనుగుణంగా మొబైల్‌ను ఉంచి కేవలం ‘క్యాప్చర్’ లేదా ‘ఛీజ్’అని ఆర్డరేస్తే చాలు దానంతట అదే సెల్ఫీ తీసుకునే మొబైల్స్ మార్కెట్‌లోకి వస్తున్నాయి.

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా ఐరిస్ ఎక్స్ 1 పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇందులో సెల్ఫీ ఇబ్బందులను తగ్గించేందుకు వాయిస్ ఫోటో కంట్రోల్ సిస్టంను ఏర్పాటు చేశారు. దీంతో సెల్ఫీలు మరింత సులువు కానున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement