పిరమాల్ చేతికి యాష్ స్టీవెన్స్... | Piramal Enterprises to acquire Ash Stevens Inc for more than Rs 350 crore | Sakshi
Sakshi News home page

పిరమాల్ చేతికి యాష్ స్టీవెన్స్...

Aug 17 2016 12:36 AM | Updated on Sep 4 2017 9:31 AM

పిరమాల్ చేతికి యాష్ స్టీవెన్స్...

పిరమాల్ చేతికి యాష్ స్టీవెన్స్...

పిరమాల్ ఎంటర్‌ప్రెజైస్ కంపెనీ అమెరికాకు చెందిన కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ సంస్థ ‘యాష్ స్టీవెన్స్’ను కొనుగోలు చేయనుంది.

న్యూఢిల్లీ: పిరమాల్ ఎంటర్‌ప్రెజైస్ కంపెనీ అమెరికాకు చెందిన కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ సంస్థ ‘యాష్ స్టీవెన్స్’ను కొనుగోలు చేయనుంది. డీల్ విలువ 53 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.350 కోట్లు). తమ అమెరికా పూర్తి అనుబంధ సంస్థ.. యాష్ స్టీవెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుందని, డీల్ మొత్తాన్ని నగదు రూపంలో యాష్ స్టీవెన్స్ కంపెనీకి చెల్లిస్తామని పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ బీఎస్‌ఈకి నివేదించింది. కాగా యాష్ స్టీవెన్స్ కంపెనీ హై పొటెన్సీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రీడియంట్స్‌ను (హెచ్‌పీఏపీఐ) అభివృద్ధి చేయడంతోపాటు తయారు కూడా చేస్తోంది. కొనుగోలు వార్తల నేపథ్యంలో పిరమాల్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్‌ఈలో 7 శాతంపైగా వృద్ధితో రూ.1,801కి ఎగసింది.

Advertisement
 
Advertisement
Advertisement