
ఫోక్స్‌వ్యాగన్ కొత్త సీఈఓగా మ్యులర్
ఫోక్స్‌వ్యాగన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా మాథియస్ మ్యులర్ నియమితులయ్యారని జర్మనీ వార్తాపత్రిక హడెల్స్‌బ్లాట్ వెల్లడించింది...
ఫ్రాంక్‌ఫర్ట్: ఫోక్స్‌వ్యాగన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా మాథియస్ మ్యులర్ నియమితులయ్యారని జర్మనీ వార్తాపత్రిక హడెల్స్‌బ్లాట్ వెల్లడించింది. కాలుష్య వివరాలకు సంబంధించి నియంత్రణ సంస్థలను మోసం చేసిన కేసులో రాజీనామా చేసిన మార్టిన్ వింటర్‌కెర్న్ స్థానంలోకి62 సంవత్సరాల మ్యులర్ ఎంపికయ్యారని హావెల్స్‌బ్లాట్ వెల్లడించింది. ఫోక్స్‌వ్యాగన్ సూపర్‌వైజరీ బోర్డ్‌కు చెందిన సీనియర్ సభ్యులు కూడా మ్యులర్ ఎంపిక పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని ఆ పత్రిక పేర్కొంది.