టిక్‌టాక్‌ డౌన్‌లోడ్స్‌లో మనమే టాప్‌ | India Tops At TikTok downloads Chart | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ డౌన్‌లోడ్స్‌లో మనమే టాప్‌

Nov 16 2019 4:27 PM | Updated on Nov 16 2019 4:28 PM

India Tops At TikTok downloads Chart - Sakshi

సోషల్‌ వీడియో యాప్‌ భారత్‌లో పెను సంచలనం సృష్టిస్తూ అత్యధిక డౌన్‌లోడ్స్‌ జాబితాలో ప్రముఖ స్ధానంలో నిలిచింది.

బీజింగ్‌ : సోషల్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ ప్లే సహా యాప్‌ స్టోర్‌ నుంచి 150 కోట్ల డౌన్‌లోడ్లను చేరుకోగా 46.8 కోట్ల యూనిక్‌ ఇన్‌స్టాల్స్‌తో భారత్‌ నెంబర్‌ వన్‌గా నిలిచింది. టిక్‌టాక్‌ డౌన్‌లోడ్స్‌లో 31 శాతం భారత్‌ నుంచే కావడం గమనార్హం. 2019లో టిక్‌టాక్‌ గత ఏడాది కంటే ఆరు శాతం అధికంగా 61.4 కోట్ల డౌన్‌లోడ్స్‌ సాధించిందని మొబైల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ సెన్సార్‌ టవర్‌ వెల్లడించింది. 2019లో భారత నెటిజన్లు ఇప్పటివరకూ 27.6 కోట్ల వరకూ టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, గ్లోబల్‌ ఇన్‌స్టాల్స్‌లో ఇది 45 శాతం వరకూ ఉంటుందని ఆ నివేదిక తెలిపింది.

ఇక చైనా 4.5 కోట్ల డౌన్‌లోడ్స్‌తో రెండవ అత్యధిక డౌన్‌లోడర్‌గా, 3.6 కోట్ల డౌన్‌లోడ్స్‌తో అమెరికా టాప్‌ 3లో నిలిచాయి. టిక్‌టాక్‌ 61 కోట్ల డౌన్‌లోడ్స్‌తో ఈ ఏడాది అత్యధిక డౌన్‌లోడింగ్‌ నాన్‌ గేమింగ్‌ యాప్‌ విభాగంలో మూడవ స్ధానంలో ఉంది. వాట్సాప్‌ 70.74 కోట్లతో, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ 63.2 కోట్లతో ఈ ఏడాది అత్యధిక డౌన్‌లోడింగ్‌ యాప్‌లుగా టాప్‌ 2 స్ధానాలను దక్కించుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement