హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు శుభవార్త | HDFC Banks cuts MCLR by up to 10 bps for 6 month-3 year loans | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు శుభవార్త

Nov 7 2019 8:17 PM | Updated on Nov 7 2019 8:17 PM

HDFC Banks cuts MCLR by up to 10 bps for 6 month-3 year loans - Sakshi

సాక్షి, ముంబై: ప్రయివేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణాలపై వడ్డీరేటును తగ్గించిందది. మార్జినల్-కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్‌ను (ఎంసిఎల్‌ఆర్) 10 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) దాకా తగ్గిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. ఆరు నెలల  నుంచి 3 సంవత్సరాల  వ్యవధిగల  గృహ,వాహన రుణాలపై  వడ్డీరేటును తగ్గించింది.  సవరించిన వడ్డీరేట్లు  నేటి (నవంబర్ 7) నుంచే అమలు చేయనున్నట్టు తెలిపింది. 

రేట్ కట్ కట్ తరువాత,  6 నెలల ఎంసిఎల్ఆర్ 5 బీపీఎస్‌ పాయింట్లు తగ్గి  8.10 శాతానికి చేరింది. అలాగే 1 సంవత్సరాల రేటు 8.30 శాతం,  2 సంవత్సరాల 8.40 శాతం, 3 సంవత్సరాల రేటు 10 బీపీఎస్‌ పాయింట్లు  తగ్గి  8.5 శాతంగా ఉండనుంది.  అయితే ఓవర్‌ నైట్‌, ఒక నె ల,మూడు నెలల  కాల వ్యవధిల రుణాలపై వసూలు రేటును మాత్రం యథాతథంగా ఉంచింది.

Advertisement
 
Advertisement
Advertisement