32 కోట్లతో ఇల్లు కొన్న ఫ్లిప్కార్ట్ చీఫ్ బిన్నీ బన్సల్ | Flipkart CEO Binny Bansal enters rich Bengaluru boulevard with Rs 32 crore home buy | Sakshi
Sakshi News home page

32 కోట్లతో ఇల్లు కొన్న ఫ్లిప్కార్ట్ చీఫ్ బిన్నీ బన్సల్

Jun 24 2016 12:45 AM | Updated on Aug 1 2018 3:40 PM

32 కోట్లతో ఇల్లు కొన్న ఫ్లిప్కార్ట్ చీఫ్ బిన్నీ బన్సల్ - Sakshi

32 కోట్లతో ఇల్లు కొన్న ఫ్లిప్కార్ట్ చీఫ్ బిన్నీ బన్సల్

ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బిన్నీ బన్సాల్ తాజాగా బెంగళూరులోని ఎంట్రప్రెన్యూరియల్ (ఐటీ) హబ్ ‘కోరమంగళ’లో రూ. 32 కోట్లు వెచ్చించి ఇంటిని

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బిన్నీ బన్సాల్ తాజాగా బెంగళూరులోని ఎంట్రప్రెన్యూరియల్ (ఐటీ) హబ్ ‘కోరమంగళ’లో రూ. 32 కోట్లు వెచ్చించి ఇంటిని (10,000 చదరపు అడుగుల విస్తీర్ణం) కొనుగోలు చేశారు. ఇందుకోసం రెండు ప్రైవేట్ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారు. బెంగళూరులో ఇటీవల కాలంలో జరిగిన అత్యంత ఖరీదైన ఇళ్ల కొనుగోళ్లలో ఇది కూడా ఒకటి. బిన్నీ బన్సాల్ తాజాగా కొనుగోలు చేసిన ప్రాంతంలోనే ఫ్లిప్‌కార్ట్ మరొక సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్‌కు కూడా ఇల్లుంది. అలాగే ఇక్కడ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకని, క్రిష్ గోపాలకృష్ణన్, నారాయణ ెహ ల్త్ వ్యవస్థాపకుడు దేవీ ప్రసాద్ శెట్టి, రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ వంటి తదితర ప్రముఖులు నివసిస్తున్నారు. ఇక్బాల్ కుటుంబం నుంచి బిన్నీ బన్సాల్ ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. కోరమంగళ ప్రాంతం.. సంపన్నులకు నెలవు.

Advertisement
 
Advertisement
Advertisement