భారత్ ఫోర్జ్ చేతికి అమెరికా ఆటో కంపెనీ | Bharat Forge to buy Walker Forge Tennessee for $14 million | Sakshi
Sakshi News home page

భారత్ ఫోర్జ్ చేతికి అమెరికా ఆటో కంపెనీ

Nov 19 2016 12:41 AM | Updated on Sep 4 2017 8:27 PM

భారత్ ఫోర్జ్ చేతికి అమెరికా ఆటో కంపెనీ

భారత్ ఫోర్జ్ చేతికి అమెరికా ఆటో కంపెనీ

అమెరికాకు చెందిన వాకర్ ఫోర్జ్ టెన్నెస్సీ ఎల్‌ఎల్‌సీ (డబ్ల్యూఎఫ్‌టీ)కంపెనీని భారత వాహన విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ రూ.95 కోట్లకు (1.4 కోట్ల డాలర్లు)కొనుగోలు చేయనున్నది.

డీల్ విలువ రూ.95 కోట్లు

 న్యూఢిల్లీ:  అమెరికాకు చెందిన వాకర్ ఫోర్జ్ టెన్నెస్సీ ఎల్‌ఎల్‌సీ (డబ్ల్యూఎఫ్‌టీ)కంపెనీని భారత వాహన విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ రూ.95 కోట్లకు (1.4 కోట్ల డాలర్లు)కొనుగోలు చేయనున్నది. వాహన, ఇతర పారిశ్రామిక విభాగాల్లో తన ఉత్పత్తులను మరింతగా పెంచుకునే లక్ష్యంలో భాగంగా ఈ కంపెనీని భారత్ ఫోర్జ్ కొనుగోలు చేయనున్నది. తమ అమెరికా అనుబంధ కంపెనీ భారత్ ఫోర్జ్ అమెరికా ద్వారా డబ్ల్యూఎఫ్‌టీని కొనుగోలు చేయనున్నామని భారత్ ఫోర్జ్ పేర్కొంది. ఈ కంపెనీ కొనుగోలును తమ ఫైనాన్‌‌స అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్  కమిటీ ఆమోదించిందని భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా ఎన్. కల్యాణి చెప్పారు. ఈ కంపెనీ కొనుగోలుకు అవసరమైన నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకుంటామని వివరించారు. డబ్ల్యూఎఫ్‌టీ కంపెనీ ఈ ఏడాది 2.8 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించగలదని అంచనా.

Advertisement
 
Advertisement
Advertisement