దిగ్గజాలతో పోటీకి సై అంటున్న అమెజాన్
ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్, అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజాలు అల్పాబెట్ ఇంక్ గూగుల్, మైక్రోసాప్ట్ కార్పొరేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్లతో పోటీకి సిద్ధమైంది.
శాన్ ఫ్రాన్సిస్కో : ఆన్ లైన్ రీటైల్ దిగ్గజం అమెజాన్, అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజాలు అల్పాబెట్ ఇంక్ గూగుల్, మైక్రోసాప్ట్ కార్పొరేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్లతో పోటీకి సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(కృత్రిమ మేధస్సు) సాప్ట్ వేర్ ద్వారా వ్యాపారాలను సులభతరం చేసుకోవడానికి కొత్త క్లౌడ్ సర్వీసులను టెస్ట్ చేస్తోంది. అమెజాన్ కంప్యూటర్లలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాప్ట్ వేర్ విస్తృతిని పెంచి వ్యాపారాలను మెరుగుపరుచుకోవడానికి ఈ కొత్త సర్వీసులు తోడ్పడనున్నాయి. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ సర్వీసులను కొంతమంది కస్టమర్లు ఇప్పటికే టెస్ట్ చేశారని బ్లూమ్ బర్గ్ నివేదించింది.
అయితే ఇలాంటి సర్వీసులను గూగుల్, మైక్రోసాప్ట్ లు ఇంతకుముందే ప్రారంభించాయి. క్లౌడ్ కస్టమర్ల కోసం ఇతర మిషన్ లెర్నింగ్ సామర్థ్యాలపై అమెజాన్ ప్రస్తుతం పనిచేస్తోంది. ఈ కొత్త సర్వీసుల ద్వారా తన వ్యాపారాలను కంప్యూటర్లలో వివిధ విభాగాల్లో పనిచేసేందుకు తోడ్పడతాయని బ్లూమ్ బర్గ్ నివేదించింది.


