టైలర్ల సంక్షేమానికి కృషి చేస్తా : డిప్యూటీ సీఎం ఆళ్ల నాని | Tailors Association Honored Deputy CM Alla Nani at Eluru | Sakshi
Sakshi News home page

టైలర్ల సంక్షేమానికి కృషి చేస్తా : డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

Sep 29 2019 4:40 PM | Updated on Sep 29 2019 4:43 PM

Tailors Association Honored Deputy CM Alla Nani at Eluru - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : టైలరింగ్‌ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని హామీ ఇచ్చారు. ఆదివారం ఏలూరు టైలర్‌ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. అందరికీ ఆరోగ్య శ్రీ వర్తింపు, అర్హులైన వృద్ధులకు పెన్షన్‌ సౌకర్యం వంటి సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని వివరించారు. టైలర్ల సంఘానికి కమ్యూనిటీ హాల్‌ అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు బాధ్యత తీసుకుంటానని ఆళ్ల నాని వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement