సూపర్మార్కెట్లో భారీ చోరీ | Robbery in supermarket in nuzvid | Sakshi
Sakshi News home page

సూపర్మార్కెట్లో భారీ చోరీ

Jan 29 2016 11:23 AM | Updated on Aug 30 2018 5:27 PM

కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలోని స్టార్ సూపర్ మార్కెట్లో గురువారం ఆర్థారాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు.

నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలోని స్టార్ సూపర్ మార్కెట్లో గురువారం ఆర్థరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. షాపు వెనుక భాగంలో  కిటీకీ తలుపులు బద్దలు కొట్టుకుని దొంగలు లోపలికి ప్రవేశించారు. రూ. 40 వేలు, విలువైన వస్తువులతోపాటు సీసీ కెమెరా, కంప్యూటర్‌ను అపహరించుకుని పోయారు.

శుక్రవారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన షాపు సిబ్బంది... యజమానికి సమాచారం అందించారు. యజమాని షాపు వద్దకు చేరుకుని... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా షాపునకు చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. దొంగలను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement