ఏటీఎంలో చోరీకి విఫలయత్నం | Robbery attempt at ATM in anantapur district | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

Feb 13 2016 2:06 PM | Updated on Aug 30 2018 5:24 PM

అనంతపురం జిల్లా గుంతకల్లులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో శనివారం వేకువజామున చోరీ యత్నం జరిగింది.

అనంతపురం : అనంతపురం జిల్లా గుంతకల్లులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో శనివారం వేకువజామున చోరీ యత్నం జరిగింది. స్థానిక డీఎస్పీ కార్యాలయం సమీపంలోని ఏటీఎంలోకి ఆగంతకులు ప్రవేశించి... మిషన్ తాళం పగులగొట్టారు. డబ్బును ఉంచే బాక్స్‌కు సీక్రెట్ కోడ్ ఉండటంతో అది తెరుచుకోకపోవడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. 

ఆ విషయాన్ని శనివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు  సమాచారం అందించారు. పోలీసులు ఏటీఎం సెంటర్కి చేరుకున్నారు. అనంతరం ఏటీఎంలోని సీసీ కెమెరా ఫుటేజిని పరిశీలించి, దుండగులను గుర్తిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement