యాజమాన్య కోటా సీట్లకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ | ntr health versity online entrace for convenor quota | Sakshi
Sakshi News home page

యాజమాన్య కోటా సీట్లకు ఆన్‌లైన్ ఎంట్రన్స్

Mar 6 2015 1:33 AM | Updated on Sep 2 2017 10:21 PM

ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 35 శాతం యాజమాన్య కోటా (బి-కేటగిరీ) సీట్ల భర్తీకి ప్రత్యేకంగా ‘అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ నిర్వహించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సన్నద్ధమవుతోంది.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సన్నద్ధం

విజయవాడ: ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 35 శాతం యాజమాన్య కోటా (బి-కేటగిరీ) సీట్ల భర్తీకి ప్రత్యేకంగా ‘అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ నిర్వహించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సన్నద్ధమవుతోంది. ఈ సీట్లకుప్రత్యేకంగాప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని యోచిస్తున్నట్టు హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు.

 

ఇప్పటివరకు అందుబాటులోని సీట్ల ప్రకారం తెలంగాణ, ఏపీలలో కలిపి 1,242 (ఏయూ పరిధిలో 420, ఎస్‌వీయూ పరిధిలో 227, ఓయూ పరి దిలో 595) సీట్లకే అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement