వివాహిత ఆత్మహత్యాయత్నం | Married to commit suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్యాయత్నం

Mar 2 2016 12:39 AM | Updated on Sep 3 2017 6:46 PM

కోళ్లఫారంలో పనిచేస్తున్న ఓ వివాహిత మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

ఏలూరు అర్బన్ : కోళ్లఫారంలో పనిచేస్తున్న ఓ వివాహిత మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలి కథనం ప్రకారం.. పెదవేగి మండలం ముండూరులోని ఒక కోళ్లఫారంలో గెడ్డం ప్రభావతి భర్త శామ్యూల్‌తో కలిసి పనిచేస్తోంది. ఆమె దీర్ఘకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. దానికి మందులు కూడా వాడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం విపరీతమైన కడుపునొప్పి రావడంతో తాళలేక భర్తలేని సమయంలో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితికి చేరుకుంది. భర్త వచ్చి ఆమె అచేతనంగా పడి ఉండడం గమనించి వెంటనే ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement