నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం | Low pressure in bay of bengal | Sakshi
Sakshi News home page

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం

Nov 12 2014 11:25 PM | Updated on Sep 2 2017 4:20 PM

తమిళనాడుకు తూర్పుదిశగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

విశాఖపట్నం: తమిళనాడుకు తూర్పుదిశగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దక్షిణ కోస్తాలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు... అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తరకోస్తా, రాయలసీమ, తెలంగాణల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement